-
-
Home » Andhra Pradesh » Guntur » angirekula varaprasad
-
అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి
ABN , First Publish Date - 2020-12-28T05:51:34+05:30 IST
గౌతులచ్చనపై అనుచిత వాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.

ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల
గుంటూరు(తూర్పు), డిసెంబరు27: గౌతులచ్చనపై అనుచిత వాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన బీసీ రాష్ట్ర స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిఽథిగా పాాల్గొని ఆయన ప్రసంగించారు. రాజ్యంగ, చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించేందుకు బీసీలు మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానికసంస్థలలో 34శాతం బీసీ రిజర్వేషన్లకోసం రాష్ట్రర పభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల విదేశీవిద్యకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. సమావేశంలో బీసీ సంఘ నాయకులు రమణ, వేముల శ్రీనివాసరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.