-
-
Home » Andhra Pradesh » Guntur » amul
-
పాడి పరిశ్రమకు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2020-12-20T05:11:42+05:30 IST
మహిళా రైతుల భాగాస్వామ్యంతో చేపట్టబోతున్న ఏపీ అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి పరిశ్రమ స్వయం సమృద్ధి సాధిస్తుందని, మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ అహ్మద్‌బాబు పేర్కొన్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు
గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళా రైతుల భాగాస్వామ్యంతో చేపట్టబోతున్న ఏపీ అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి పరిశ్రమ స్వయం సమృద్ధి సాధిస్తుందని, మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి కోర్ టీమ్ సభ్యులు, మెంటార్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్బంగా అహ్మద్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రైతుభరోసా కేంద్రాల్లో పాల సేకరణ పాయింట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. పాల సేకరణకు సంబంధించిన నగదుని 10 రోజుల్లోనే రైతులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తామన్నారు. ఆర్‌బీకేల వద్ద పాల నాణ్యతని గుర్తించే యంత్రాలు, ఒక్కో కేంద్రం వద్ద 10 టన్నుల పశుదాణ సిద్ధంగా ఉంచుతామన్నారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున అమూల్ సంస్థకి అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. గుజరాత్ రాష్ట్ర పొక్యూర్‌మెంట్ సబర్ డెయిరీ గ్రూపు హెడ్ డాక్టర్ మహేంద్ర పటేల్, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కస్పారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.