రాజ్యాంగానికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2020-11-27T05:25:55+05:30 IST

భారత రాజ్యాంగ స్ఫూర్తికి వన్నె తెచ్చేలా రాజకీయపక్షాలు మసలు కోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు.

రాజ్యాంగానికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాణిక్యవరప్రసాద్‌, ఏసురత్నం, రమేష్‌గాంధీ తదితరులు

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌


గుంటూరు, నవంబరు 26: భారత రాజ్యాంగ స్ఫూర్తికి వన్నె తెచ్చేలా రాజకీయపక్షాలు మసలు కోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గురువారం లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, రాజ్యాంగ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ ఈరి రాజశేఖర్‌, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడిద బాబురావు, వైసీపీ నాయకులు గనిక ఝాన్సీరాణి, దాసరి జాన్‌బాబు, శామ్యూల్‌, అశ్వినీకుమార్‌, నీలాంబరం తదితరులున్నారు.


గుజ్జనగుండ్లలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ చంద్రగిరి ఏసురత్నం, నాయకులు ప్రభు, నరసింహరావు, అంగిరేకుల గోపికృష్ణ పాల్గొన్నారు. 


ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్‌లోని సంఘం కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ నాయకులు, ఉప్పుటూరి పేరయ్య, తురకా శ్రీను, కోలా మణికంఠ, కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.


అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, బైరిశెట్టి మల్లికార్జునరావు, విద్యావేత్త రవిబాబు, సుబ్బారెడి తదితరులున్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జోనల్‌ కో ఆర్డినేటర్‌ నీలం రవికిరణ్‌ ఆద్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.  


యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకల్‌ హెడ్‌ శ్రీనివాస్‌,  విశ్రాంత అధికారి జెల్ది ఇస్మాయిల్‌బాబు, డిప్యూటీ రీజనల్‌ హెడ్‌లు గణేష్‌, కె.హరిబాబు, చీఫ్‌ మేనేజర్లు సుధాకర్‌,   ముజిబిర్‌ రహమాన్‌, సుబ్బారావు, లక్ష్మణ్‌, అశ్విన్‌కుమార్‌దాస్‌, ఎల్‌డీఎం ఈదర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


దేశంలో పేదలకు డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారని డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌ తెలిపారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్‌ చరిత్రపుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T05:25:55+05:30 IST