అమరావతిని రక్షించండి

ABN , First Publish Date - 2020-07-15T14:15:32+05:30 IST

అమరావతిని రక్షించాలని రాజధాని రైతులు, మహిళలు కోరారు. రాష్ట్ర ఏకైక..

అమరావతిని రక్షించండి

తుళ్ళూరు, తాడికొండ, జూలై 14: అమరావతిని రక్షించాలని రాజధాని రైతులు, మహిళలు కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 210వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని రక్షించండి అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులను  నిలిపివేసి అభివృద్ధిని అడ్డుకోవడం జగన్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చామని, తమను అపహాస్యం చేయవద్దని వేడుకున్నారు. విద్యుత్‌ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని రైతులు, మహిళలు, చిన్నారులు మంగళవారం కూడా నిరసనలు కొనసాగించారు.  


Updated Date - 2020-07-15T14:15:32+05:30 IST