అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-07-05T10:20:56+05:30 IST

అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన నేతృత్వంలో

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

రాజధాని రైతులకు జిల్లా బీజేపీ నేతల సంఘీభావం


గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన నేతృత్వంలో శనివారం గుంటూరులో రాజధాని రైతులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్‌ మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, నేతలు జూపూడి హైమావతి, పాలపాటి రవికుమార్‌, అప్పిశెట్టి రంగారావు, మాధవరెడ్డి, ప్రదీప్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:20:56+05:30 IST