15న అమరావతిలో పవన్ పర్యటన

ABN , First Publish Date - 2020-02-08T22:29:18+05:30 IST

రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన ఖరారైంది. ఈనెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు...

15న అమరావతిలో పవన్ పర్యటన

అమరావతి: రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన ఖరారైంది. ఈనెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అమరావతి రైతులను కలిసి ఉద్యమానికి పవన్‌ మద్దతు తెలపనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి జనసేన తరుపున మద్దతు తెలిపి ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.


ఇదిలా ఉంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Updated Date - 2020-02-08T22:29:18+05:30 IST