అమరావతితోనే రాష్ట్ర భవిత
ABN , First Publish Date - 2020-03-16T07:09:43+05:30 IST
అమరావతిని కదిలించటం అంటే ఆంధ్రాని కదిలించటమేనని స్వామి కమలానంద భారతి అన్నారు.
రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్న కుట్ర సాగుతోంది
స్వామి కమలానంద భారతి
గుంటూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అమరావతిని కదిలించటం అంటే ఆంధ్రాని కదిలించటమేనని స్వామి కమలానంద భారతి అన్నారు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో అమరావతి ఆశ్యకత అనే అంశంపై ఆదివారం ఆయన ప్రసంగించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్న కుట్ర సాగుతోందని ఆరోపించారు. గోదావరి నీరు తెలంగాణ మీదుగా సీమకు అందిస్తామన్నప్పుడు ఈ కుట్రకు బీజం పడిందని తెలిపారు. అదే జరిగితే ఆంధ్రాతో సీమకు దూరమవుతుందన్నారు.
అలానే విశాఖ రాజధాని అంటే జై కళింగ ఉద్యమం పురుడుపోసుకుంటుందని చెప్పారు. హైద రాబాదులో ఆస్తులు ఉన్న నేతలు ఆంధ్రా పాలకులుగా ఉన్నంత కాలం రాష్ట్రం అధోగతే అన్నారు. అమరావతితోనే ఆంధ్రా భవిత అని స్వామి కమలానంధ భారతి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, మల్లికార్జునరావు, స్వామి, నందకిషోర్‌తో పాటు లాయర్లు, ఇంజనీర్లు, లెక్చర్లతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ప్రజా గాయకుడు రమణ బృందం అమరావతి ఉద్యమ పాటలు పాడి అందరిని ఆలోచింప జేశారు.