మీ పాత్ర లేదనడం సరికాదు
ABN , First Publish Date - 2020-09-20T14:37:06+05:30 IST
రాజధాని విషయంలో కేంద్రం పాత్ర లేదని పదే పదే చెప్పటం సరికాదని..

రాజధానిపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ జయదేవ్
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని విషయంలో కేంద్రం పాత్ర లేదని పదే పదే చెప్పటం సరికాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో తమ పాత్ర లేదని ఎలా చెప్తారని శనివారం లోక్సభ జీరో అవర్లో కేంద్రాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. ఢిల్లీ మించిన రాజధాని కట్టుకోండి ఆర్థికంగా కేంద్రం అండగా ఉంటుందని అని చెప్పిన మీరు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదనటంలో పునరాలోచించుకోవాలని కోరారు. రాజధాని అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిందని.. భవనాలతో సహా మొత్తం రూ.41వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని తెలిపారు. నేడు ఏపీలో జరిగిన విధంగా ఇతర రాష్ట్రాలు అనుసరించటానికి కేంద్రమే దారిచూపినట్లుగా ఉంటుందని హెచ్చరించారు.