ఆరు నెలల్లోనే హామీల అమలు

ABN , First Publish Date - 2020-02-08T09:42:31+05:30 IST

దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరునెలల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి

ఆరు నెలల్లోనే హామీల అమలు

  • రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సత్తెనపల్లి: దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరునెలల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు ప్రాంతంలో శుక్రవారం రూ.7కోట్ల 53 లక్షలతో చేయనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళస్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు ఇం టివద్దకే అందిస్తున్నామన్నారు. ఎవరైనా అర్హత ఉండి పెన్షన్‌లు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అమ్మఒడిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.15వేలు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి  చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. సీఎం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటుచేయబోతున్నారన్నారు.  అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పక్షానికి పనిలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుందన్నారు. నిరంతరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. గత పాలకులకు భిన్నంగా సచివాలయాలు, వలంటీర్లు ఏర్పాటు చేశామన్నారు.  

Updated Date - 2020-02-08T09:42:31+05:30 IST