-
-
Home » Andhra Pradesh » Guntur » akkala ramesh mruthi
-
ప్రముఖ శిల్పి అక్కల రమేష్ హఠాన్మరణం
ABN , First Publish Date - 2020-12-28T05:48:11+05:30 IST
పట్టణానికి చెందిన ప్రముఖశిల్పి అక్కల వీరసత్య రమే్‌ష్(45) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతి చెందారు.

తెనాలి రూరల్, డిసెంబరు 27: పట్టణానికి చెందిన ప్రముఖశిల్పి అక్కల వీరసత్య రమే్‌ష్(45) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడున్నారు. ప్రముఖ శిల్ప అక్కల మంగయ్యకు రమేష్ రెండవకుమారుడు. అజంతా కళారామం సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా తెలుగు రాష్ట్రాల్లో రమేష్ సుపరిచితుడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలను రమేష్ నిర్వహించారు. సోమవారం ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.