దాతృత్వం అభినందనీయం

ABN , First Publish Date - 2020-12-14T05:06:02+05:30 IST

సాహిత్య, విద్య, సాంస్కృతిక రంగాలతో పాటు అనేక సమాజహిత కార్యక్రమాలకు విరాళాలు అందిస్తున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ధాతృత్వానికి ప్రతీకగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు.

దాతృత్వం అభినందనీయం
ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్థికసాయం అందజేస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం

ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం

గుంటూరు(సాంస్కృతికం), డిసెంబరు 13: సాహిత్య, విద్య, సాంస్కృతిక రంగాలతో పాటు అనేక సమాజహిత కార్యక్రమాలకు  విరాళాలు అందిస్తున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ధాతృత్వానికి ప్రతీకగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. నగరంపాలెం బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆర్యవైశ్య విద్యార్థుల వసతి గృహం ప్రాంగణంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 50 మంది ఉపాధ్యాయులకు ఆదివారం రూ.2,50,000  ఆయన చేతులమీదుగా ఆందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మద్యవిమోచన అమలు కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పారిశ్రామికవేత్త బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, స్ఫూర్తి అవార్డు కమిటీ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు,  అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T05:06:02+05:30 IST