రైతులపై పక్షపాత వైఖరి తగదు

ABN , First Publish Date - 2020-12-16T04:42:30+05:30 IST

రైతులపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అనుసరిస్తోందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు అన్నారు.

రైతులపై పక్షపాత వైఖరి తగదు
రిలయన్స్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు

గుంటూరు(విద్య),డిసెంబరు 15: రైతులపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అనుసరిస్తోందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు అన్నారు. మంగళవారం స్థానిక లక్ష్మీపురంలోని రిలయన్స్‌ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రైతులు రోజుల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కిరణ్‌, నగర కార్యదర్శి కిరణ్‌కబీర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వలి, నవీన్‌, సూర్యం తదితరులు పాల్గొన్నారు.


Read more