సంగం పాలు అధిక ధరలకు విక్రయిస్తే ఏజన్సీ రద్దు

ABN , First Publish Date - 2020-03-23T08:41:03+05:30 IST

జనతా కర్ఫ్యూతో పాలకు డిమాండ్‌ పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్యాకెట్లను అదనపు ధరలకు విక్రయించారు. దీంతో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళ్లిపాళ్ల ...

సంగం పాలు అధిక ధరలకు విక్రయిస్తే ఏజన్సీ రద్దు

గుంటూరు, మార్చి 22: జనతా కర్ఫ్యూతో పాలకు డిమాండ్‌ పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్యాకెట్లను అదనపు ధరలకు విక్రయించారు. దీంతో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పందించి అలా పాల ప్యాకెట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలను అధిక ధరకు విక్రయిస్తే వారి ఏజన్సీ రద్దు చేస్తామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా పాల సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిస్తే 9618284455, 7674998899 ఫోన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Updated Date - 2020-03-23T08:41:03+05:30 IST