రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-11-16T05:04:13+05:30 IST

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి దాచేపల్లి మండలంలోని శ్రీనగర్‌ గ్రామంలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

దాచేపల్లి, నవంబరు15: రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి దాచేపల్లి మండలంలోని శ్రీనగర్‌ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన చింటూకుమార్‌(20), సంజిత్‌ సదా (25) ద్విచక్రవాహనంపై దాచేపల్లిలోని పొందుగులకు ప్రయాణిస్తున్నారు. శ్రీనగర్‌ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొనటంతో ఇరువురికి బలంగా గాయాలయ్యాయి. చింటూకుమార్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా కొనఊపిరితో ఉన్న సంజిత్‌సదాకు ప్రథమచికిత్స నిర్వహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. వీరిద్దరు దాచేపల్లిలోని ముగ్గుమిల్లులోని కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-11-16T05:04:13+05:30 IST