ఆరోగ్య శ్రీ అందదా..?.. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలకు చెక్‌ చెప్తారా

ABN , First Publish Date - 2020-12-12T05:21:12+05:30 IST

ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రి అంటేనే భయం. అక్కడికి వెళ్తే సరైన చికిత్సలు అందించరు.. వైద్యులు పట్టించుకోరు..

ఆరోగ్య శ్రీ అందదా..?.. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలకు చెక్‌ చెప్తారా

ప్రైవేటు వైద్యశాలలకే పథకం పరిమితమా

కలెక్టర్‌ ప్రకటనతో రోగుల్లో ఆందోళన

పథకం నిలిపేస్తే పాతరోజులే...

మందులు, పరికరాల కోసంప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిందే...


గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 11: ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రి అంటేనే భయం. అక్కడికి వెళ్తే సరైన చికిత్సలు అందించరు.. వైద్యులు పట్టించుకోరు.. రోగంతో వెళ్తే మరణమే శరణ్యం అనే నానుడి ఉండేది. అందుకు తగ్గట్లు గానే గతంలో ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఉండేది. అయితే ఆరోగ్య శ్రీతో ఆ పరిస్థితి పూర్తి గా మారిపోయింది. ఈ పథకంతో రోగులకు చికి త్సలు అందించడం వల్ల అటు వైద్యులూ.. ఇటు ఆ ఆస్పత్రి కూడా లబ్ధి పొందేది. దీంతో ప్రైవేటు వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందుతుండేవి. అంతేగాక ప్రైవేటు వైద్య శాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆధునిక వైద్య పరికరాలను కూడా సమకూర్చుకునేందుకు ప్రభుత్వ వైద్యశాలల వద్ద నిధులు పుష్కలంగా నిధులు వచ్చేవి. అయితే ఇదంతా గతమేనా అం టే.. గురువారం గుంటూరులో కలెక్టర్‌ చేసిన ప్రక టన చూస్తే అవుననే పలువురు అంటున్నారు.


కలెక్టర్‌ ప్రకటనతో ఖంగు..

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో గురువారం  జరిగిన సమావేశంలో కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ వైద్యులు ఖంగుతిన్నా రు. ఇకపై వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహించే శస్త్రచికిత్సలకు, ఇతర చికిత్సలకు ప్రభుత్వం పారితోషికం చెల్లించదని, గతంలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ చికిత్సలకు జీజీహెచ్‌కు రావాల్సిన రూ.10 కోట్ల బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించబోదని ఆయన ప్రకటించారు. ఇదే జరి గితే ప్రభుత్వ వైద్యశాలల్లో పాత రోజులు వస్తా యని పేదలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధు లు నిలిపివేస్తారన్న వార్తలతో మరలా ప్రైవేటు బాట పట్టడమే దిక్కులా మారే పరిస్థితులు కన బడుతున్నాయి. కలెక్టర్‌ ప్రకటించినట్లు జరిగితే ఏపీఎంఐడీసీ పంపిన మందులనే వాడాల్సి వస్తుంది. లేక పోతే రోగులే ఆయా మందులను కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రభుత్వాసుపత్రిపై నమ్మకం ఉంచుతారనేది సం దేహమే. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ఉంటే అటే వెళ్లి పోతారు. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు ఎన్నడూ ప్రభుత్వాసుపత్రికి రారు. దీంతో వైద్యులు చికిత్స ఏమో గానీ, వైద్య విద్యార్థులకు మాత్రం తీవ్ర నష్టం జరగనుంది. చిన్న చిన్న పరికరాల కోసం  ఇక నుంచి  వైద్యశాఖ అధికారులు ప్రభుత్వం వద్ద చేయి చాపాల్సిన పరిస్థితి  ఏర్పడుతుంది.


సేవలు.. సౌకర్యాలు

దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీతో  ప్రభుత్వా సుపత్రుల పరిస్థితి మారింది. ఈ పథకం ద్వారా చికిత్సలు అందించడంతో వైద్యులకు జీతంతో పాటు కొన్ని ఇన్సెంటివ్‌లు అదనంగా రావడంతో సేవలు అందించేందుకు పోటీపడేవారు. ఆస్పత్రికి కొన్ని నిఽధులు కూడా రావడంతో మౌలిక సదు పాయాల కల్పన కూడా ఎక్కువగా జరిగింది. పదేళ్ల క్రితంతో పోల్చుకుంటే ప్రభుత్వ ఆస్ప త్రుల్లో అనేక రెట్లలో చికిత్సలు పెరిగాయి. 2009 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించి ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా అనుసంధానం చేశారు. ఈ పథకం ద్వారా రూ.100 ఆరోగ్యశ్రీ చికిత్స ద్వారా ఆసుపత్రికి వస్తే అందులో రూ.35 చికిత్స చేసిన వైద్యుడికి, రూ.20 ఆసుపత్రిలో మౌలిక వసతులకు, రూ.25 రోగికి అవసరమైన మందులు, ఉద్యోగుల వసతికి, మిగిలిన రూ.20 డీఎంఈ వద్ద రివాల్వింగ్‌ ఫండ్‌కు కేటాయిం చేవారు. డీఎంఈ వద్ద ఉండే నిధులతో ఆస్పత్రు లకు అవసరమైన సిటీ స్కాన్‌, లీనియర్‌ యాక్సి లేటర్‌ వంటి ఆధునిక పరికరాలను కొనుగోలు చేసేవారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పదేళ్ల కిత్రం ఉన్న వార్డుల పరిస్థితికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం కేవలం ఈ ఆరోగ్యశ్రీ నిధులే అంటే ఆశ్చర్యం కాదు. గతంలో ప్రభుత్వ వైద్యులకు ఇచ్చే వేతనాల కన్నా ప్రైవేటు రంగంలో చికిత్స చేసే వారి కి సంపాదన ఉండేది. దీంతో ప్రభు త్వ వైద్యులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రైవేటు చికిత్సకే మొగ్గు చూపే వారు. ఆరోగ్యశ్రీ ద్వారా 35 శాతం నిధులు నేరుగా వారి ఖాతాల్లోకే వస్తుండటంతో ఎక్కువ మంది వైద్యులు ప్రభుత్వ వైద్యశాలలోనే శస్త్ర చికిత్సలకు మొగ్గు చూపారు.


నెలకు రూ.7 కోట్లు.. 100 మందికిపైగా ఉద్యోగాలు

గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సరాసరిగా ప్రతినెలా ఆరోగ్యశ్రీ నిధుల ద్వారానే ప్రతి నెలా రూ.40 లక్షల నిధులు ఆసుపత్రికి జమ అవుతుంటాయి. జిల్లాలోని మిగిలిన ఆసుప త్రుల్లో అది మరో రూ.20 లక్షలు ఉండవచ్చు. అంటే ప్రతినెలా జిల్లాలోని ప్రభుత్వ ఆసు పత్రులకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎవరితో ప్రమేయం లేకుండా ఏడాదికి రూ.7 కోట్లు నిధులు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే రోగులకు పరీక్షలు నిర్వహిం చడం, చికిత్స అనంతర సేవల కోసం జిల్లా లో వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నిధుల నుంచే వేతనాలు చెల్లిస్తారు. ఆరోగ్య శ్రీని ప్రైవేటుకే పరిమితం చేస్తే ప్రభుత్వ ఆస్ప త్రుల్లో చికిత్సలతో పాటు, నిధులు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆ 150 చికిత్సల మాటేమిటి..

ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం సుమారు 2,344 చికిత్సలు అందిస్తుంది. వీటిలో 150 నుంచి 180 రకాలకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీని అనుమతిస్తు న్నారు. ప్రైవేటులో ఆ చికిత్సలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో కేవలం ప్రభుత్వాసుప త్రులకే అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం వీటి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యం ద్వారా ప్రభుత్వాసు పత్రిల్లో కొన్ని చికిత్సలు జరుగు తున్నాయి. వాటికి నిధులు ఆరోగ్యశ్రీ నుంచి అందజేస్తు న్నారు. కార్డియాలజీ విభాగంలో క్యాత్‌ ల్యాబ్‌ ఏర్పాటు, గుండె చికిత్సలు, ఎంఆర్‌ఐ పరీక్షలు, పీపీఈ ద్వారానే జరుగుతున్నాయి. ఆరోగ్య శ్రీ నిధులు నిలిపివేస్తే వీటి పరిస్థితి ఏమిటోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2020-12-12T05:21:12+05:30 IST