అంబేద్కర్‌కు ఘననివాళి

ABN , First Publish Date - 2020-04-15T09:44:58+05:30 IST

జిల్లావ్యాప్తంగా మంగళవారం భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత సంఘాలు

అంబేద్కర్‌కు ఘననివాళి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లావ్యాప్తంగా మంగళవారం భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత సంఘాలు ప్రపంచమేధావి అంబేద్కర్‌కు ఘననివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.  


డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాల్లో పార్టీశ్రేణులతో కలిసి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి బాపట్లలోని జమ్ములపాలెం ఆర్‌వోబి వద్ద, రైల్వేస్టేషన్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ అంబేద్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత అన్నం సతీష్‌ ప్రభాకర్‌, అంటరానితన నిర్మూలనపోరాటసమితిరాష్ర్టాధ్యక్షుడు డాక్టర్‌ జి.చార్వాక... అంబేద్కర్‌కు నివాళులర్పించారు. సమసమాజాన్ని నిర్మించేందుకు అంబేద్కర్‌ కృషిచేశారని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, సంఘనాయకులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.


వేమూరు: నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా, దళితసంఘాలు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అన్ని వర్గాల సమానత్వానికి పాటుపడి భరతజాతి ముద్దుబిడ్డగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నిలిచారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ కొనియాడారు. స్థానిక లుంబినీవనంలో ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కత్తిపద్మారావు అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  జనసేన రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి కమతం సాంబశివరావు పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ యరమల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలోని కేబీరోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహానికి, స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే విడదల రజిని పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డాక్టర్‌ అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలను ఒక ప్రకటనలో కొనియాడారు.


టీడీపీ, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీ, మాలమహానాడు, బీఎస్పీ నేతలు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి డాక్టర్‌ అరవిందబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. వినుకొండ పట్టణంలోని నరసరావుపేటరోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


తమ నివాసంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ లీలావతి  అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నేరెళ్లరాజు, బీజేపీ, సీపీఐ, మజ్లిస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని జరిపారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులోని తన నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. సత్తెనపల్లిలో టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ కార్యాలయాల్లో,  ప్రజాచైతన్య భారతి, దళితసంఘాల ఆధ్వర్యంలో, ఎమ్మార్పీఎస్‌ మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు.  భారతదేశ సామాజిక విప్లవకారుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ కొనియాడారు.


గుంటూరులోని తన కార్యాలయం వద్ద అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. అచ్చంపేటలో అంబేద్కర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చిలుకా చంద్రయ్య ఆధ్వర్యంలో, పెదకూరపాడు, క్రోసూరు, అమరావతి, బెల్లంకొండలో అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నిజమైన ఆదర్శవాది, సమాజ సంస్కర్త అని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. జయభారత్‌ కాలనీలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఇంటివద్ద అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుళ్లూరు, శాఖమూరు,  వెంకటపాలెం ఆయా నేతలు,   ఫిరంగిపురంలో ఎస్సీ విభాగం రాష్ట్రనేత పెరికల జేమ్స్‌ ఇన్నయ్యబాబు, కార్డ్స్‌ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ పి.అమరనాథ్‌ తదితరులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

Updated Date - 2020-04-15T09:44:58+05:30 IST