సామాజిక న్యాయం లేని బడ్జెట్‌

ABN , First Publish Date - 2020-06-19T10:03:01+05:30 IST

అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాజిక న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన

సామాజిక న్యాయం లేని బడ్జెట్‌

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు


గుంటూరు, జూన్‌ 18: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాజిక న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. గుంటూరులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ   బడ్జెట్‌లో 20 శాతమున్న ప్రజలకు వ్యవసాయ బడ్జెట్‌ పేరుతో రూ.29వేల కోట్లు, 50శాతం ఉన్న బీసీలకు రూ.25వేల కోట్లు కేటాయించటం ఎలా సామాజిక న్యాయం అనిపించుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వం బీసీల ఉప ప్రణాళిక కింద గత ఏడాది కంటే రూ.10వేలు కోట్లు పెంపు సంతోషమైనప్పటికీ కేటాయింపులలో బీసీల కుల వృత్తులకు సామాజిక న్యాయం జరగలేదనేది బీసీల అభిప్రాయమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, అన్నం శేషగిరిరావు తదితరులున్నారు. 

Updated Date - 2020-06-19T10:03:01+05:30 IST