మెగా జాబ్‌మేళాలో 570 మంది ఎంపిక

ABN , First Publish Date - 2020-02-16T07:40:07+05:30 IST

మెగా జాబ్‌మేళాలో 570 మంది ఎంపిక

మెగా జాబ్‌మేళాలో 570 మంది ఎంపిక

బాపట్ల, ఫిబ్రవరి 15 : బాపట్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం ఆలివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సహకారంతో మెగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్‌ రఘుపతి ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున హాజరయ్యారు. 1600మందిని 21 కంపెనీలకు చెందిన వారు ఇంటర్వ్యూలు నిర్వహించి 570 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్‌ రఘుపతి మాట్లాడుతూ నిరుద్యోగయువత ఉపాధి అవకాశాలు ఏర్పాటుచేసుకోవటంతోపాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలు పొందాలని కోరారు.  అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అలివ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అబిజిత్‌జయంత్‌, మేనేజర్‌ కేవీ రమణ, కోఆర్డినేటర్‌ నాగరాజు, విజయ్‌, రాజేష్‌,  వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T07:40:07+05:30 IST