జిల్లాలో కొత్తగా 56,056 బియ్యం కార్డులు

ABN , First Publish Date - 2020-06-22T10:05:39+05:30 IST

జిల్లాలో కొత్తగా 56,056 కుటుంబాలకు కొత్త బియ్యం కార్డులు మంజూరయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పీ ప్రశాంతి ఒక

జిల్లాలో కొత్తగా 56,056 బియ్యం కార్డులు

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 56,056 కుటుంబాలకు కొత్త బియ్యం కార్డులు మంజూరయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పీ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రేషన్‌కార్డు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత సచివాలయాల్లో దాఖలు చేసుకున్న అర్జీలను విచారించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేశామన్నారు.


ఆయా కార్డులను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలకు పంపించడం జరిగిందన్నారు. కుటుంబలో ఒక సభ్యుడు ఈ-కేవైసీ తీసుకుని వారికి కార్డులను వలంటీర్లు పంపిణీ చేస్తారని తెలిపారు. ఎవరైనా లబ్ధిదారులు అర్జీ దాఖలు చేసిన సమయంలో చూపించిన అడ్రస్‌లో ప్రస్తుతం నివాసం లేకపోయినా, మరే ఇతర కారణాల వలన కార్డు పొందలేకపోయినా వారు ఎక్కడైతే అర్జీ దాఖలు చేశారో ఆ గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి కార్డు పొందాలని సూచించారు. 

Updated Date - 2020-06-22T10:05:39+05:30 IST