విస్తరిస్తున్న మహమ్మారి

ABN , First Publish Date - 2020-07-20T10:37:10+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తోంది. గతవారం రోజులుగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారిన

విస్తరిస్తున్న మహమ్మారి

జిల్లాలో కొత్తగా 485 మందికి వైరస్‌

గుంటూరులో 202 మంది బాధితులు

సత్తెనపల్లిలో 52.. మంగళగిరి 33


గుంటూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌  జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తోంది. గతవారం రోజులుగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 485 మందికి వైరస్‌ సోకగా గుంటూరు నగరంలో  202 మంది వైరస్‌ బారిన పడ్డారు.


చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. సుబ్బయ్యతోటలో 4, సుభానినగర్‌లో 2, సొలస వారి వీధిలో 1, బాబుగారితోటలో 1, తూర్పు మాలపల్లిలో 1, కృష్ణనగర్‌లో 1 కేసు నమోదయ్యింది. మండలంలోని కావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాదెండ్ల మండలం సాతులూరులోని బీసీ కాలనీలో ఓ యువకుడికి, ఎండుగుంపాలెంలో మరొకరికి పాజిటివ్‌గా నమోదయ్యింది. యడ్లపాడు నాయుళ్ల వీధికి ఓ వ్యక్తి  కరోనా బారినపడ్డాడు. అతని తొమ్మిదేళ్ల కుమారుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. యడ్లపాడు పైపల్లెలోని ఓ మహిళకు కూడా కరోనా సోకింది. మేదర బజారులో ఓ వ్యక్తి అనారోగ్యంతో వారం క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహానికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు అధికారులు తెలిపారు. 


వినుకొండ పట్టణంలో 17 కేసులు నమోదైనట్లు ఆర్‌ఐ జానీబాషా తెలిపారు. నేటినుంచి వచ్చే ఆది వారం వరకు  పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమ లు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఓ కరోనా కేసు నమోదైనట్లు తహసీల్దార్‌ సుజాత తెలిపారు. 


వేమూరు మండలంలోని పెరవలిపాలెంలో ఇటీవల కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యాధికారి వెంకట సురేష్‌ తెలిపారు.  ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో భార్య, భర్తలకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. చాగంటివారిపాలెం మరో పదిమందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. పొన్నూరులోని 30 వార్డులో ఒకే కుటుంబంలో  నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన్నట్టు  మున్సిపల్‌ కమిషనర్‌  వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు.  


ప్రత్తిపాడు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహించే ముగ్గురికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వారి కుటుంబంలో ఒకరు కూడా కరోనా బారిన పడ్డారు. ఓ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి కూడా కరోనా నిర్ధారణ అయింది. యనమదలలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.  కాకుమాను మండలం బోడిపాలెంలో ఓ కరోనా కేసు నమోదు అయినట్లు అధికారులు ధ్రువీకరించారు.  


మాచర్ల పట్టణంలోని 25వ వార్డుకు చెందిన మహిళ(56) అనారోగ్యంతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఈమెను అధికారులు శనివారం సాయంత్రం ఎన్‌ఆర్‌ఐకు తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ మహిళ మృతిచెందింది. కారంపూడి మండలంలో నాలుగు  కేసులు నమోదయ్యాయి. వీరిలో గాదెవారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి(49) గుంటూరుకు తరలించగా మధ్యాహ్న సమయంలో మృతి చెందాడు. తాడికొండ మండలంలో ఆరు పాజిటివ్‌ కేసులను అధికారులు నిర్ధారించారు. పెదకూరపాడు మండలం చిన మక్కెనలో ఓ కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయి నట్టు డాక్టర్‌ ప్రియాంక  తెలిపారు. గారపాడులో ఓ యువకుడికి కరోనా నిర్ధారణ అయింది.


కొల్లిపర మండలంలోని సిరిపురం, అత్తోటలో ఒక్కో కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం 13 కొత్తకేసులు నమోదయ్యాయి. జాన పాడు గ్రామంలో ఓ కేసు నమోదైంది.    మాచ వరం మండలంలోని పలు గ్రామాల్లో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు వైద్యాధికారి అనూష తెలిపారు. దాచేపల్లి మం డలంలో  పది  కేసులు నమోదయ్యాయి. 


మంగళగిరి మండలం నవులూరులో 2, ఆత్మకూరులో 1, చినకాకానిలో 1 నమోదు అయ్యాయి. తాడేపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ అధికారికి, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్దారించారు తాడేపల్లి పట్టణంలో 2, కుంచనపల్లిలో 2, ఉండవల్లిలో 1 కేసు నమోదు అయ్యాయి. రేపల్లె పట్టణ పరిధిలో 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయని డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు.   బాపట్ల పట్టణంలో 5గురికి కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు డాక్టర్‌ భాస్కరరావు తెలిపారు. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  బాపట్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందాడు.  


తెనాలి పట్టణంలో ఆదివారం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐతానగర్‌లో 7, ముత్తంశెట్టిపాలెం 2, గంగానమ్మపేట, సుల్తా నాబాద్‌, చెంచుపేట, చంద్రబాబుకాలనీ, ఆల పాటినగర్‌, నాజరుపేట, నందులపేట, మారిస్‌పేట, చినరావూరులో ఒక్కో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.    


నరసరావుపేటలో 39 మందికి..

నరసరావుపేటలో  కొత్తగా 39 మందికి పాజిటివ్‌ నమోదైంది. పాతూరులో ఒకే ఇంటిలో 7గురుకి వైరస్‌ సోకింది. ప్రకాష్‌నగర్‌, ప్రశాంతినగర్‌, నంబూరుబజార్‌, షాలెంనగర్‌ ప్రాంతాల్లో 13 మందికి వైరస్‌ నిర్ధారించారు. బరంపేట, పాతూరు, ఐలాబజార్‌, 1వ వార్డు, కాకతీయనగర్‌లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్ణణం, పరిసర గ్రామాలలో కేసుల సంఖ్య 596కు చేరింది. పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలౌతోంది. నరసరావుపేట మండలం ములకలూరుకు చెందిన వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తహసీల్దార్‌ రమణానాయక్‌  తెలిపారు.


సత్తెనపల్లిలో వైరస్‌ ఉధృతి

సత్తెనపల్లి పట్టణంలో ఆదివారం 41 కరోనా కేసులు నమోదైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు వైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు.  సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడులో 4, కొమెరపూడిలో 4, రెంటపాళ్ళలో 1 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నకరికల్లు మండలంలోని గుండ్లపల్లిలో నలుగురికి, కుంకలగుంటలో ఒకరికి, కండ్లగుంటలో ఒక రికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2020-07-20T10:37:10+05:30 IST