-
-
Home » Andhra Pradesh » Guntur » 4 lakh liquor seized
-
4లక్షల మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2020-08-20T11:05:33+05:30 IST
తెలంగాణా రాష్ట్రం నుంచి తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన మద్యాన్ని బుధవారం పొందుగల చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు గురజాల రూరల్ సీఐ ఉమేష్ తెలిపారు. మినిలారీతో పాటు ఇద్దరు

దాచేపల్లి, ఆగస్టు19: తెలంగాణా రాష్ట్రం నుంచి తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన మద్యాన్ని బుధవారం పొందుగల చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు గురజాల రూరల్ సీఐ ఉమేష్ తెలిపారు. మినిలారీతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వలంటీరు ఇంట్లో అక్రమ మద్యం
రొంపిచర్ల, ఆగస్టు 19: మండలంలోని విప్పర్ల గ్రామంలో గ్రామ వలంటీరు ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణా మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అతని తండ్రి అక్కయ్యను అదుపులోకి తీసుకోగా గోపి పరారీలో ఉన్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.