నేటి నుంచి నరసరావుపేటలో..4 గంటలు సడలింపు

ABN , First Publish Date - 2020-05-18T09:36:06+05:30 IST

నరసరావుపేటల్లో అమల్లో ఉన్న సంపూర్ణ నిర్బంధానికి సోమవారం నుంచి సడలింపు ఇస్తున్నట్టు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి ఆదివారం ప్రకటించారు.

నేటి నుంచి నరసరావుపేటలో..4 గంటలు సడలింపు

నరసరావుపేట, మే 17 : నరసరావుపేటల్లో అమల్లో ఉన్న సంపూర్ణ నిర్బంధానికి  సోమవారం నుంచి సడలింపు ఇస్తున్నట్టు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకు సడలింపు ఉంటుందన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లలోప్రస్తుత నిర్బంధమే కొనసాగుతుందని చెప్పారు. వరవకట్ట, రామిరెడ్డిపేట, అరండల్‌పేట, ఎన్‌జీవో కాలనీ, పెదచెరువు, ఏనుగుల బజారు, నిమ్మతోట, ఇస్లాంపేట, ప్రకాష్‌నగర్‌, లింగంగుంట్ల, శ్రీరాంపురం కంటైన్‌మెంట్‌ జో న్‌లలో లాక్‌డౌన్‌ సడలింపు ఉంటుందని, ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావద్దని సూచించారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లు మినహా మూడవ వార్డు నుంచి 24వ వా ర్డు వరకు సోమవారం, 1, 2, 25 నుంచి 34 వార్డుల వరకు మంగళవారం లాక్‌డౌన్‌ సడలింపు అమలవుతుందన్నారు. ఇలా రోజు మార్చి రోజు నాలుగురోజుల పాటు సడలింపు అ మలు జరుగుతుందని తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో లేని ఆస్పత్రులు పనిచేసే విధంగా అనుమతులు ఇవ్వటం జరిగిందని తెలిపారు. పల్నాడు రోడ్డులోని పీఎన్‌సీ, రామిరెడ్డిపేట, ప్రకాష్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులు, ఎస్‌బీఐ బజారు బ్యాంక్‌, ఓరియంటల్‌ కామర్స్‌ బ్యాంక్‌, లక్ష్మీ విలాస బ్యాంక్‌లు పని చేస్తాయని వారు వివరించారు.  

Updated Date - 2020-05-18T09:36:06+05:30 IST