-
-
Home » Andhra Pradesh » Guntur » 25lack
-
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-30T06:01:36+05:30 IST
అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతులను, వారి సంక్షేమాన్ని మరచిందని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం ఇచ్చి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే రూ.25లక్షల ఆర్థికసాయాన్ని అందించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి డిమాండ్ చేశారు.

రైతుభరోసా కేంద్రం వద్ద టీడీపీ నేతల డిమాండ్
తాడేపల్లి, డిసెంబరు 29: అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతులను, వారి సంక్షేమాన్ని మరచిందని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం ఇచ్చి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే రూ.25లక్షల ఆర్థికసాయాన్ని అందించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి డిమాండ్ చేశారు. మంగళవారం రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా చిర్రావూరులో రైతుభరోసా కేంద్రాన్ని రైతులు, నేతలు సందర్శించి, పంటనష్టం పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యంపై నిరసన తెలిపారు. రైతుభరోసా కేంద్ర ప్రతినిధిని అడిగి నమోదు వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు కళ్లం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రాలకు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ద రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో లేదన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్, వీరిశెట్టి శ్రీనివాస్, ఎండీ ఇబ్రహీం, వల్లూరు సూరిబాబు, చావలి ఉల్లయ్య, చిగురుపాటి సుబ్బారావు, పఠాన్ ఖాసింఖాన్, నూతక్కి ఏడుకొండలు, పఠాన్ జానీఖాన్, శ్రీనివాస్, కొమ్మా లవకుమార్, శివయ్య, బాపనయ్య, ప్రభాకర్, రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.