20,038 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2020-12-11T06:04:56+05:30 IST

mirchi

20,038 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం మొత్తం 21,239 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 20,038 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 41,104 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ.6,000, గరిష్ఠంగా రూ.9,800, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.6,000, రూ.14,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.3,000, రూ.4,500 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీలకు రూ.7,000, రూ.15,500, ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500 ధర లభించినట్లు సెక్రెటరి ఎం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-11T06:04:56+05:30 IST