జడ్పీఎన్ఎఫ స్టేట్ రిసోర్సు పర్సన్ మృతి
ABN , First Publish Date - 2020-12-01T06:17:21+05:30 IST
కోటనందూరు, నవంబరు 30: కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామానికి చెందిన జడ్పీఎన్‌ఎ్‌ఫ స్టేట్ రిసోర్సు పర్సన్ పచ్చళ్ల అమ్మాజీ (52) ఆదివారం రాత్రి
కోటనందూరు, నవంబరు 30: కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామానికి చెందిన జడ్పీఎన్‌ఎ్‌ఫ స్టేట్ రిసోర్సు పర్సన్ పచ్చళ్ల అమ్మాజీ (52) ఆదివారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందారు. ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి ఆమె కృషి చేశారు. తూర్పు- విశాఖ జిల్లాలకు సంబ ంధించి పెట్టుబడి లేని వ్యవసాయం చేసి కొత్త వంగడాలను సృష్టించి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఆమె భర్త దేవుళ్లు అచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అమ్మాజీ కుటుంబ సభ్యులను డీపీఎం ఇలియాజర్, అడిగర్ల రామకృష్ణ, రమణ, మాజీ సర్పంచ్ గాది రాము, కుంచె అచ్చిరాజు, అశోక్, మల్లికార్జున, వరలక్ష్మి, కమ ల, సంతోష్, బుజ్జమ్మ పరామర్శించారు.