ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

పెద్దాపురం, డిసెంబరు 5: ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన సాధ్యపడుతుందని జడ్పీ సీఈవో సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని

ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో

జడ్పీ సీఈవో సత్యనారాయణ

పెద్దాపురం, డిసెంబరు 5: ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన సాధ్యపడుతుందని జడ్పీ సీఈవో సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని జి.రాగంపేట గ్రామ ంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 15 వరకూ వ్యర్థాలపై యుద్ధం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే మనం- మన పరిశుభ్రత పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. గ్రామాల్లో ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పారిశుధ్యం మెరుగుదలకు ప్రతీ పంచాయతీకి రూ.50 వేలు మంజూరు చేసినట్టు సీఈవో తెలిపారు. అనంతరం సంపద తయారీ కేం ద్రంలో ఎరువును ఆయన కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో పి.నారాయణమూర్తి, డీఎల్‌డీవో కేఎన్‌వీ ప్రసాద్‌, ఎంపీడీవో ఎ.రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కె.హిమమహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సెలెట్‌రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST