ఆన్‌లైన్‌లో ఆట..పాట
ABN , First Publish Date - 2020-12-10T05:57:37+05:30 IST
ఆన్‌లైన్ వేదికగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ డి.మురళీఽధర్‌రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభం
భానుగుడి(కాకినాడ) డిసెంబరు, 9: ఆన్‌లైన్ వేదికగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ డి.మురళీఽధర్‌రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని యువజనులు సద్వినియోగం చేసుకుని ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. యువతీ, యువకులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రతిభను చాటడమే కాకుండా సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చునని చెప్పారు. యువజనోత్సవాల్లో మొత్తం 8 విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. మొదటిరోజు 50 మందికి పైగా విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చినట్లు సెట్రాజ్ సీఈవో ఎమ్.భానుప్రకాష్ చెప్పారు.