తగ్గుతున్న ఏలేరు వరద
ABN , First Publish Date - 2020-10-24T05:39:15+05:30 IST
గొల్లప్రోలు, అక్టోబరు 23: ఏలేరు వరద తగ్గుతుంది. రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను శుక్రవారం ఉదయం 8వేల నుంచి 6వేల క్యూసెక్కులకు

గొల్లప్రోలు, అక్టోబరు 23: ఏలేరు వరద తగ్గుతుంది. రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను శుక్రవారం ఉదయం 8వేల నుంచి 6వేల క్యూసెక్కులకు తగ్గించగా, సాయంత్రానికి ఐదు వేల క్యూసెక్కులకు పరిమితం చేశారు. గొల్లప్రోలు పట్టణ శివారుల్లో రహదారులపై వరద నీటి ప్రవాహం తగ్గింది. ఏలేరు, పీబీసీ కాలువలకు పలుచోట్ల గండ్లు పడిన నేపథ్యంలో వరద నీరు పొలాల్లో మీదుగా వెళ్లుతుండటంతో ముంపు పూర్తిగా తగ్గలేదు.