‘ఫ్లెక్సీలు చింపినవారిపై చర్యలు తీసుకోండి’
ABN , First Publish Date - 2020-11-16T05:23:06+05:30 IST
పిఠాపురం, నవంబరు 15: పట్టణంలో వైసీపీకి చెందిన ఫ్లెక్సీ బోర్డులను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 13న అర్ధరాత్రి బ్లేడుతో కోసేశారని

పిఠాపురం, నవంబరు 15: పట్టణంలో వైసీపీకి చెందిన ఫ్లెక్సీ బోర్డులను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 13న అర్ధరాత్రి బ్లేడుతో కోసేశారని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజీ ఆధారంగా నేరస్థులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేస్తామని ఎస్‌ఐ నబి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు బాలిపల్లి రాంబాబు, బోను దేవానిజడ వెంకటేశ్వరరావు, కంచర్ల సత్యనారాయణ, ఖండపల్లి లోవరాజు, చంద్రకళ, శ్యామలరావు, సోమరౌతుల కుక్కల నాగమణి ఉన్నారు.