అభిమన్యుడి వీరత్వంపై పుస్తక రచన
ABN , First Publish Date - 2020-09-20T10:24:28+05:30 IST
పట్టణంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల పూర్వ విద్యార్థి ఉంగరాల ఆదిత్య 19 ఏళ్లకే పుస్తక రచన చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. మహాభారతంలో అభిమన్యుడు వీరత్వం, వీరోచిత ప్రదర్శనలు, ఆయన జీవితంలో జ

పెద్దాపురం, సెప్టెంబరు 19: పట్టణంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల పూర్వ విద్యార్థి ఉంగరాల ఆదిత్య 19 ఏళ్లకే పుస్తక రచన చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. మహాభారతంలో అభిమన్యుడు వీరత్వం, వీరోచిత ప్రదర్శనలు, ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల ఆధారంగా ‘రౌద్రధారి అభిమన్యు’ పేరుతో ఆంగ్లంలో పుస్తక రచన చేశాడు. దీనిని ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ బుక్స్ సంస్థ ప్రచురించింది. శ్రీప్రకాష్ పాఠశాలలోని రీడింగ్ క్లబ్, పాఠశాల డైరెక్టర్ విజయ్‌ప్రకాష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పుస్తక రచన చేసినట్టు ఆదిత్య తెలిపాడు. తమ విద్యార్థి పుస్తక రచన చేయడం గర్వంగా ఉందని డైరెక్టర్ విజయ్‌ప్రకాష్ ఆదిత్యను అభినందించారు.