-
-
Home » Andhra Pradesh » East Godavari » wrestiling team selection
-
రెజ్లింగ్ పోటీలకు జిల్లా జట్టు
ABN , First Publish Date - 2020-12-28T05:52:50+05:30 IST
జిల్లా రెజ్లింగ్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఆదివారం జిల్లా జట్టు ఎంపికను నిర్వహించారు. రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.ఎలీషాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలను సంఘం కార్యదర్శి రామచంద్రమూర్తి ప్రారంభించారు.

కాకినాడ స్పోర్ట్స్, డిసెంబరు 27: జిల్లా రెజ్లింగ్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఆదివారం జిల్లా జట్టు ఎంపికను నిర్వహించారు. రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.ఎలీషాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలను సంఘం కార్యదర్శి రామచంద్రమూర్తి ప్రారంభించారు. సీనియర్ మెన్, ఉమెన్ విభాగంలో గ్రీకోస్టైల్, ఫ్రీ స్టైల్ మెన్, ఫ్రీ స్టైల్ ఉమెన్ విభాగంలో 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారి నుంచి తిరుపతిలో జనవరి 2 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు కోచ్ దుర్గ ఆధ్వర్యంలో 50 మందిని ఎంపిక చేశారు.