అధ్వానంగా వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ: వర్మ

ABN , First Publish Date - 2020-09-06T10:16:22+05:30 IST

అధ్వానంగా వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ: వర్మ

అధ్వానంగా వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ: వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 5: నియోజకవర్గంలో వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాల్టీల్లో సమస్యలు ఎక్కువవ్వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వీధిలైట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదన్నారు. పందుల సమస్య పెరిగిందని, వీధుల్లో బ్లీచింగ్‌ చల్లడం లేదని, దోమల స్ర్పే చేయడం లేదన్నారు. తక్షణమే మెరుగైన చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని కోరారు. కేంద్రం ఇచ్చిన కరోనా నివారణ నిధులు దుర్వినియోగమయ్యాయని, వీటిపై త్వరలోనే సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతామన్నారు. అధికారులు స్పందించకుంటే వార్డుల వారీగా ఆందోళనకు సిద్ధమని వర్మ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-06T10:16:22+05:30 IST