15 నాటికి ‘నాడు నేడు’ పనులు పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2020-12-10T05:55:18+05:30 IST

నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడునేడు పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని అర్బన్‌ డీఐ బి.దిలీప్‌కుమార్‌ అన్నారు.

15 నాటికి ‘నాడు నేడు’ పనులు పూర్తవ్వాలి

  •  ప్రధానోపాధ్యాయుల సమావేశంలో డీఐ దిలీప్‌కుమార్‌ 

రాజమహేంద్రవరం సిటీ డిసెంబరు 9: నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడునేడు పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని అర్బన్‌ డీఐ బి.దిలీప్‌కుమార్‌ అన్నారు. కోటగుమ్మంలోని మండల వనరుల కేంద్రంలో బుధవారం నాడునేడు పనుల ప్రగతిపై ఆయన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచఎంలు వారి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా నగరపాలక సంస్థ ఎస్‌ఈ ఓంప్రకాష్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు పనులకు ఖర్చుచేసిన మొత్తానికి రికార్డులన్నీ అప్డేట్‌ చేసుకోవాలని చెప్పారు. ఇసుక, సిమెంట్‌ కొరత ఉంటే తెలియజేయాలని ఎస్‌ఈ సూచించారు. స్కూల్స్‌ వారీగా పనుల ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో సమగ్రశిక్షా ఏఈ నాగమోహన్‌, కార్పొ రేషన ఈఈ పాండురంగారావు, ఏఈ భవాని, కార్పొరేషన్‌ స్కూల్స్‌ డీవైఈవో పులగుర్త దుర్గాప్రసాద్‌, 37 పాఠశాలల హెచ్‌ఎంలు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T05:55:18+05:30 IST