ఉపాధి సిబ్బంది తీరుపై ఏపీడీ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-30T05:50:15+05:30 IST

కరప ఉపాధిహామీ పథకం సిబ్బంది పనితీరుపై కాకినాడ క్లస్టర్‌ ఏపీడీ ఎ.శాంతి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఉపాధి సిబ్బంది తీరుపై ఏపీడీ ఆగ్రహం

కరప, డిసెంబరు 29: కరప ఉపాధిహామీ పథకం సిబ్బంది పనితీరుపై కాకినాడ క్లస్టర్‌ ఏపీడీ ఎ.శాంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఉపాధిహామీ పథకం కార్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. సమయం పదకొండు కావస్తున్నా ఏపీవోతో సహా సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించిన ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సకాలంలో విధులకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. అనంతరం ఉపాధి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ క్లస్టర్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు 1,138.73ఎకరాల్లో 233 లేఅవుట్‌లను సిద్ధం చేస్తున్నామని, వీటిలో 163 లేఅవుట్‌లు వివిధ దశల్లో ఉన్నట్టు ఆమె తెలిపారు. కాకినాడ క్లస్టర్‌ టీఏ కె.వెంకటేష్‌, సీవో బెనర్జీ, ఎఫ్‌ఏ గంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:50:15+05:30 IST