ఎస్‌ఐ సస్పెన్షనకు గురైన కేసు లా అండ్ ఆర్డర్‌కు బదలాయింపు
ABN , First Publish Date - 2020-10-24T06:37:32+05:30 IST
ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు.

అన్నవరం, అక్టోబరు 23: ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు. తహశీల్దార్ సుబ్రహ్మణ్యం తదితరులు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి మహిళ అ త్తింటివారిని తీసుకెళ్లి పరిశీలించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.