గతంలో టీడీపీ కోసం పనిచేసిందని..

ABN , First Publish Date - 2020-12-17T05:47:31+05:30 IST

మహిళా వలంటీరుపై అధికార పార్టీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. శాంతినగర్‌కు చెందిన సీకోటి శ్రీలక్ష్మి ఏడో వార్డు సచివాయం వలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది.

గతంలో టీడీపీ కోసం పనిచేసిందని..

మహిళా వలంటీరుపై దాడి 

కాకినాడ క్రైం, డిసెంబరు 16: మహిళా వలంటీరుపై అధికార పార్టీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. శాంతినగర్‌కు చెందిన సీకోటి శ్రీలక్ష్మి ఏడో వార్డు సచివాయం వలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తన భర్తతో  పాటు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలైన సీకోటి శ్రీను, సీకోటి ప్రసాద్‌, వీరలక్ష్మి, యల్లపల్లి రవి బళ్ల సూరిబాబు, దడాల దుర్గాప్రసాద్‌ తదితరులు శ్రీలక్ష్మి కుటుంబాన్ని రెండేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం తమ కుటుంబం ఏ పార్టీకి పనిచేయడం లేదని వలంటీరుగా మాత్రమే ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నానని బాధితురాలు శ్రీలక్ష్మి వాపోయింది. బాధితురాలి ఉద్యోగాన్ని తీయించే ప్రయత్నం చేసిన అధికార పార్టీ కార్యకర్తలకు ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి తమపై దాడికి పాల్పడ్డారని శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరుగురు వ్యక్తుల వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత మహిళ ఆరోపిస్తోంది. 


ఇరువర్గాలపై కేసు నమోదు చేశాం.. 


 ఏడో వార్డు సచివాలయం వలంటీరుగా పని చేస్తున్న శ్రీలక్ష్మి కుటుంబానికి, సీకోటి శ్రీను, సీకోటి ప్రసాద్‌ల కుటుంబాల మధ్య సరిహద్దు తగాదా ఉండటంతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయని టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ఈశ్వరుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-17T05:47:31+05:30 IST