చికిత్స పొందుతూ తాపీమేస్ర్తీ మృతి

ABN , First Publish Date - 2020-12-07T06:27:13+05:30 IST

ద్రాక్షారామ బియ్యంపేటకు చెందిన తాపీమేస్ర్తీ షేక్‌ వలీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.

చికిత్స పొందుతూ తాపీమేస్ర్తీ మృతి

ద్రాక్షారామ, డిసెంబరు 6: ద్రాక్షారామ బియ్యంపేటకు చెందిన తాపీమేస్ర్తీ షేక్‌ వలీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. షేక్‌ వలీ ఈనెల 2న పురుగుల మందు తాగి భీమేశ్వరాలయం వెనుక పడి ఉండగా  ఆటోలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వలీ మృతిచెందాడు. ద్రాక్షారామ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2020-12-07T06:27:13+05:30 IST