జాప్యం లేకుండా సేవలందించాలి: జేసీ కీర్తి

ABN , First Publish Date - 2020-12-11T06:56:46+05:30 IST

ప్రజలకు ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్నిరకాల సేవలను అందజేయాలని జాయింట్‌ కలెక్టరు (సచివాలయం, అభివృద్ధి) సీహెచ్‌ కీర్తి సూచించారు.

జాప్యం లేకుండా సేవలందించాలి: జేసీ కీర్తి

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 10: ప్రజలకు ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్నిరకాల సేవలను అందజేయాలని జాయింట్‌ కలెక్టరు (సచివాలయం, అభివృద్ధి) సీహెచ్‌ కీర్తి సూచించారు. పిఠాపు రం మండలం మాధవపురం గ్రామ సచివాలయా న్ని గురువారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలు, ఉద్యో గుల పనితీరుపై ఆరా తీశారు. నాడు-నేడు పను లు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తహశీల్దారు జి.వరహాలయ్య, ఈవోపీఆర్డీ జొన్నాడ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ డీఈఈ ఏవీ కృష్ణ ఉన్నారు.

Updated Date - 2020-12-11T06:56:46+05:30 IST