పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలేంటి?

ABN , First Publish Date - 2020-05-10T09:16:07+05:30 IST

జిల్లాలోని పరిశ్రమల్లో విపత్తు నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వివిధ పరిశ్రమల ప్రతినిధులను ఆదేశించారు.

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలేంటి?

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 9: జిల్లాలోని పరిశ్రమల్లో విపత్తు నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వివిధ పరిశ్రమల ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో చేపడుతున్న ముందస్తు భద్రతా చర్యలపై పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న  21 భారీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఇందులో పెట్రోలియంనకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయని వాటి పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను పున:సమీక్షించాలన్నారు.


జిల్లాలో మూడు నెలల క్రితం గ్యాస్‌ లీకేజీ ఘటన సంభవించినా 48 గంటల్లోనే అదుపు చేశామన్నారు. పరిశ్రమల  భద్రతపై పరిశ్రమల శాఖ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలను విస్తృతం చేయాలన్నారు.    కార్మికులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, జిల్లా అడిషనల్‌ ఎస్పీ కరణం కుమార్‌. రాజమహేంద్రవరం అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి, జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు, పరిశ్రమల శాఖ డీఎం బి.శ్రీనివాస్‌, కోరమండల్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, బీపీసీఎల్‌ సేఫ్టీ మేనేజర్లు పీవీ రావు, మహంతి, సత్యనారాయణ, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-10T09:16:07+05:30 IST