తడిచెత్తను, పొడిచెత్తను..వేర్వేరుగా వేయాలి

ABN , First Publish Date - 2020-10-03T06:14:48+05:30 IST

స్వచ్ఛ కాకినాడలో భాగంగా తడి, పొడి చెత్తలను వేర్వరుగా వేయాలని స్వచ్ఛ సర్వేక్షణ్‌ స్పెషల్‌ ఆఫీ సర్‌, అసిస్టెంట్‌

తడిచెత్తను, పొడిచెత్తను..వేర్వేరుగా వేయాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రత్యేకాధికారి రామమోహన్‌ 

మనం-మన పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాలు


డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), అక్టోబరు 2: స్వచ్ఛ కాకినాడలో భాగంగా తడి, పొడి చెత్తలను వేర్వరుగా వేయాలని స్వచ్ఛ సర్వేక్షణ్‌ స్పెషల్‌ ఆఫీ సర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ రామమోహన్‌ కోరారు. జిల్లాలో పలు చోట్ల మనం-మన పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాలను శుక్రవారం నిర్వహిం చారు. కాకినాడలోని ఏఎంజీ పాఠశాల ఆడిటోరియంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. 10, 11 డివిజన్ల అధ్యక్షులు మోసా పేతూరు, గద్దేపల్లి దాసు, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ తుమ్మల సునీత, 4వ సర్కిల్‌ సెక్రటరీ నాగేంద్ర, శానిటరీ ఇన్‌స్నెక్టర్‌ సుదర్శన్‌, మేస్త్రీ చైతన్య, స్థానికులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T06:14:48+05:30 IST