-
-
Home » Andhra Pradesh » East Godavari » Welfare benefits for all eligible
-
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2020-10-07T08:26:55+05:30 IST
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సూచించారు...

పిఠాపురం రూరల్, అక్టోబరు 6: అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. పిఠాపురం మండలం విరవాడ సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. జగనన్న తోడు, కాపు నేస్తం, చేయూత, రైస్‌కార్డుల దరఖాస్తులు ఎలా అప్‌లోడ్ చేస్తున్నారో ఆరా తీశారు. విరవాడలోని రెండు సచివాలయాల్లో పాతవారికి 2,250 రైస్‌కార్డులు అందించగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 178 మందికి ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కార్యాలయానికి పూర్తిస్థాయిలో ఫర్నీచర్ సమకూరుస్తామని చెప్పారు. సచివాలయం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ వెంట తహశీల్దారు జి.వరహాలయ్య, ఎంపీడీవో డీఎల్‌ఎస్ శర్మ, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ సురేష్ తదితరులు ఉన్నారు.