-
-
Home » Andhra Pradesh » East Godavari » web options timed out
-
వెబ్ ఆప్షన్స్‌కు ముగిసిన గడువు
ABN , First Publish Date - 2020-12-19T06:04:43+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ నెల 18 అర్ధరాత్రితో వెబ్ ఆప్షన్ నమోదుకు గడువు ముగిసిందని డీఈవో ఎస్ అబ్రహాం తెలిపారు.

కాకినాడ,డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ నెల 18 అర్ధరాత్రితో వెబ్ ఆప్షన్ నమోదుకు గడువు ముగిసిందని డీఈవో ఎస్ అబ్రహాం తెలిపారు. ఇప్పటి వరకు ఆప్షన్ ఇవ్వని వారు, అసంపూర్తిగా ఇచ్చిన వారంతా సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో ఓపెన్ సబ్‌మిట్ చేసుకోవచ్చన్నారు. అలాగే ఈ నెల 21, 22 తే దీల్లో వెబ్ ఆప్షన్ అసలు ఇవ్వని వారు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. తదుపరి 23 నుంచి 30 వరకు అసంపూర్తిగా ఆప్షన్ ఇచ్చిన వారు సబ్‌మిట్ చేసుకోవాలని ఎంఈవోలకు సూచించారు. అమ్మఒడి పథకానికి సంబంధించి చైల్డ్ ఇన్ఫో నమోదు, అప్‌డేట్ కోసం ఈ నెల 19 తుది గడువన్నారు. తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం లేదన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల యాజమాన్యాల హెచ్‌ఎంలు/ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ నెల 19 లోగా తమ పాఠశాలల విద్యార్థుల వివరాలను అమ్మఒడి వెబ్‌సైట్లో నమోదు చేయాలన్నారు. తదనుగుణంగా వారి పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన పిల్లలకు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చైల్డ్ ఇన్ఫో, అప్‌డేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.