విధిగా మాస్క్‌లు ధరించండి

ABN , First Publish Date - 2020-03-28T10:12:49+05:30 IST

కివిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది అన్ని

విధిగా మాస్క్‌లు ధరించండి

అడిషనల్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా 


కాకినాడ క్రైం, మార్చి 27: కివిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు పాటించాలని అడిషనల్‌ డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏలూరు రేంజ్‌కు ప్రత్యేక అధికారిగా హరీ్‌షకుమార్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కాకినాడ వచ్చారు. ఎస్పీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌ డివిజన్ల ఎస్‌డీపీవోలు, సర్కిళ్ల సీఐలు, అన్ని పోలీ్‌సస్టేషన్ల ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్క రూ విధిగా మాస్క్‌లు ధరించి, తరుచూ సబ్బుతో హ్యాండ్‌వాష్‌ చేసుకోవాలన్నారు.


మీటరు దూరం నుంచి వాహనాలు తనిఖీ చేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసేటప్పుడు మీటరు దూరంలో ఉండి మాట్లాడాలని ఎట్టిపరిస్థితుల్లో వారిని తాకరాదని, కచ్చితంగా మాస్క్‌లు ధరిస్తూ వెళ్లాలని ఆయన పేర్కొ న్నారు. ముఖ్యంగా ప్రజలు ఇళ్లల్లోంచి బయటకురాకుండా కూరగాయలు, నిత్యావసర వస్తువులతోపాటు మెడిసిన్స్‌, పాలు తదితర వస్తువులు హోం డెలివరీ చేసేందుకు స్పెన్సర్స్‌, రిలయన్స్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. వారి వాహనాలను పోలీసులు ఆపరని, ఈ విషయంలో ఏమైనా సమస్య వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.


ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌, ఎస్పీలను హరీ్‌షకుమార్‌ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్యాలయ సిబ్బంది, డీసీఆర్‌బీ, ఎస్‌బీ, ఏ ఆర్‌ సిబ్బందికి ఆయన మాస్క్‌లు, హ్యాండ్‌గ్లౌజులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్‌నయీం అస్మీ, ఓఎ్‌సడీ ఆరీ్‌ఫహఫీజ్‌, అడ్మిన్‌ ఎస్పీ కరణంకుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ వీఎస్‌ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T10:12:49+05:30 IST