మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ABN , First Publish Date - 2020-04-25T09:16:17+05:30 IST

కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో వెనుకంజ వేయట్లేదని ఉప

మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ఉప ముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్‌ 


మండపేట, ఏప్రిల్‌ 24: కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో వెనుకంజ వేయట్లేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మంజురైన రూ 3.6 కోట్ల చెక్కును శుక్రవారం ఆయన ఎంపీ చింతా అనురాధతో కలిసి అందజేశారు.


ఈ సందర్భంగా మాట్లా డుతూ తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టి.వనజ, మునిసిపల్‌ కమిషనరు రామ్‌కుమార్‌, ఎంపీడీవో గౌతమి, వైసీపీ నేతలు కర్రి పాపారాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్య, ముమ్మిడివరపు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


అమలాపురం టౌన్‌: పట్టణ పరిధిలోని 637 మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు రూ.93.61 లక్షల వడ్డీ మాఫీని వాటి ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని సంఘాల సభ్యులకు మంత్రి పినిపే విశ్వరూప్‌ చెక్కు రూపంలో అందజేశారు.

Updated Date - 2020-04-25T09:16:17+05:30 IST