-
-
Home » Andhra Pradesh » East Godavari » We are also in the fight against Corona
-
కరోనాపై పోరులో మేము సైతం..
ABN , First Publish Date - 2020-04-07T10:19:26+05:30 IST
కరోనా వైరస్ పోరాటంలో మేము సైతం అంటూ ఆర్టీసీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రవాణా శాఖల ఉద్యోగులు సోమవారం

బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రవాణా శాఖల ఉద్యోగులు
(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం): కరోనా వైరస్ పోరాటంలో మేము సైతం అంటూ ఆర్టీసీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రవాణా శాఖల ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యా రు. జిల్లా ఎస్పీ, అర్బన్ ఎస్పీలతోపాటు ఆయా ప్రాంతాల డీఎస్పీలకు రిపోర్ట్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసుల నిర్వహించే డ్యూటీలలో వీరు కూడా భాగస్వాములయ్యారు. వీరికి వివిధ బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జీవో చేశారు. ఆర్టీసీ రాజమహేంద్రవరం రీజియన్ నుంచి 100 మంది డ్యూటీలో చేరారు. ఎక్సైజ్ నుంచి 40 మంది చేశారు. ఫారెస్ట్ శాఖ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌లో 11 మంది చేరారు. రవాణా శాఖ నుంచి కొందరు బాధ్యతలు స్వీకరించారు. కరోనా నియంత్రణలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి కొందరికి సెలవులు ఇవ్వ డంతో ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పటివరకూ పోలీసులు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, రెవెన్యూ, వైద్య సిబ్బంది, గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగులు అధికంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వీరంతా విధులకు హాజరవు తారు. ఆయా చెక్‌పోస్టులు, బీట్‌లలో కాపలా ఉంటారు. కరోనా రెడ్‌జోన్ ఏరియాలో కూడా విధులు నిర్వహిస్తారు. రైతు బజార్లు, బ్యాంకులు, ఏటీఎంలు, వివిధ కూడళ్లలో జనం గుంపులు ఉండకుండా, భౌతిక దూరం పాటించేలా వీరంతా అవగాహన కల్పిస్తున్నారు.
లారీ డ్రైవర్ల కోసం డాబాలలో భోజనాలు
ఆహార ఉత్పత్తులు రవాణా అవుతున్న నేపథ్యంలో లారీ, ఇతర వాహనాల డ్రైవర్లకు భోజనం ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ మురళీధరరెడ్డి రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాతీయ రహదారిలో అనేకచోట్ల డాబా హోటళ్లు ఓపెన్ చేయించి, వారికోసం భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇక్కడ కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. మొత్తం జిల్లాలో రోజుకు 100 లారీల వరకూ తిరుగుతున్నట్టు సమాచారం.
వీటి డ్రైవర్ల కోసం రాజమహేంద్రవరం పరిధిలో 2 డాబాలు, అన్నవరంలో 2, గండేపల్లిలో 1, అనకాపల్లిలో రెండు డాబాకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇప్ప టికే రవాణా శాఖకు కొన్ని బాధ్యతలు అప్పటించారు. అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం కూడా వీరి బాధ్యతే. ఇలా వివిధ శాఖల అధికారులు కరోనా విధులలో భాగస్వామ్యులు కావడం వల్ల ఇప్పటికే పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై కొంత ఒత్తిడి తగ్గుతుంది.