సాగునీరు సక్రమంగా అందటం లేదు

ABN , First Publish Date - 2020-12-20T06:32:22+05:30 IST

ప్రధాన పంట కాలువలు వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్ల నుంచి సాగునీరు సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సాగునీరు సక్రమంగా అందటం లేదు

తహశీల్దార్‌కు రైతుల వినతి  
పి.గన్నవరం, డిసెంబరు 19: ప్రధాన పంట కాలువలు వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్ల నుంచి సాగునీరు సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సుమారు 500 ఎకరాల ఆయకటుక్టు నీరుఅందక ఇబ్బందులు పడుతున్నామని ఊడిమూడికి చెందిన పలువురు రైతులు  తహశీల్దార్‌ బి.మృత్యంజయరావుకు వినతిపత్రం అందించారు. కనీసం నారుమడులు వేసుకోవడానికి సైతం నీరు రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్‌  హామీ ఇచ్చారు.  గత ఏడాది ప్రధాన పంటకాలువ వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్‌లను భవిష్యత్‌ దృష్ట్యా లక్షలాది రూపాయలతో ఇరువైపులా కొంతమేర పెంచారు. పైప్‌లైన్‌ల నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంతో లక్షలాది రూపాయలు నీటిపాలయ్యాయని పలువురు విమర్శలు చేస్తున్నారు. సాధనాలు రమేష్‌, విళ్ళ పురుషోత్తం, ముచ్చర్ల సోమరాజు, పిల్లా వెంకన్న, కుసుమ గోవింద్‌, పందిరి పూర్ణచంద్రరావు  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-20T06:32:22+05:30 IST