-
-
Home » Andhra Pradesh » East Godavari » vision
-
విజన 2030
ABN , First Publish Date - 2020-11-21T06:44:12+05:30 IST
భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. స్మార్ట్ సిటీ నిధులు రూ.38 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

- రూ.38 కోట్లతో నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలు
- ఎగ్జిబిషనగా మారనున్న హెరిటేజ్ భవనం
కార్పొరేషన్ (కాకినాడ): భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. స్మార్ట్ సిటీ నిధులు రూ.38 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు నాలుగైదు రకాల డిజైన్ల్‌తో నమూనా చిత్రాలు సిద్ధం చేయగా, ఒక నమూనాకు అధికారికంగా ఆమోదం లభించింది. 2030 విజన్‌తో ప్రణాళిలకు సిద్ధం చేస్తున్నారు. 1865 మద్రాసు పట్ట ణాభివృద్ధి చట్టాన్ని అనుసరించి కాకినాడ పురపాలక సం ఘం 1866 నవంబరు 1న ఏర్పడింది. ప్రస్తుతం 30 కిలోమీటర్ల విస్తీర్ణం, నగర ప్రాంతంలో 3.37 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 1.75 లక్షలు... మొత్తం 5.12 లక్షల జనాభా ఉన్నారు. జనాభా 2026 నాటికి 6.48 లక్షలకు, 2041 నాటికి 7.68 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ క్రమంలో భవిష్యత్తులో కాకినాడ నగరపాలక సంస్థ గ్రేటర్ కాకినాడగా రూపొందే అవకాశం లేకపోలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజన్-2030తో నగరపాలకసంస్థ నూతన భవనాన్ని 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ ఫోర్ తరహాలో నిర్మించ తలపెట్టారు. ఫ్లోర్‌కి రెండు డిపార్లుమెంట్లు, కౌన్సిల్ సమావేశ మందిరంతో పాటు 500 మంది కెపాసిటీతో మీటింగ్ హాలు, గ్రీన్ కాన్సెప్ట్‌లో భాగంగా సోలార్ పేనల్స్ ఏర్పాటు, గ్రీనరీ ఉండేలా డిజైన్ చేయించారు.
బ్రిటీష్ కాలంనాటి హెరిటేజ్ భవనాన్ని కదిపే ప్రయ త్నం చేయకుండా మునిసిపల్ ఎగ్జిబిషన్ భవనంగా మా ర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టెం డర్ల ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే కార్పొరేషన్ భవనాలు తొలగించి పనులు చేపట్టేందుకు సిద్ధమవు తున్నారు. 2022 నాటికి నూతన భవనాన్ని నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే అప్పటి వరకు ప్రధాన విభాగాల్లో కమిషనర్, అదనపు కమిషనర్ పేషీలతో పాటు జనరల్, అకౌంట్ సెక్షన్లను కూడా ప్రస్తుతం ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లు ఉన్న భవనంలోకి మార్చి మిగిలిన విభాగాలను బాలభవన్, స్త్రీశక్తి భవన్, స్మార్ట్ సిటీ భవనాలను పరిశీలించి అక్కడకు తరలించే అవకాశం ఉందని అధికారుల సమాచారం.