మహిళా ఎస్‌ఐపై దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-04-15T09:55:27+05:30 IST

నగరంలోని క్వారీ సెంటరుకు దిగువన వున్న 46వ డివిజన్‌లో త్రీటౌన్‌ మహిళా ఎస్‌ఐ ప్రమీలపై స్థానిక

మహిళా ఎస్‌ఐపై దౌర్జన్యం

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 14: నగరంలోని క్వారీ సెంటరుకు దిగువన వున్న 46వ డివిజన్‌లో త్రీటౌన్‌ మహిళా ఎస్‌ఐ ప్రమీలపై స్థానిక మహిళ మరికొంతమంది కలిసి దౌర్జన్యం చేశారు. ఎస్‌ఐ విధి నిర్వహణలో వుండగా కొంత మంది గుమిగూడి ఉండడంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఈ క్రమంలో లక్ష్మితో వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో అక్కడ సారాను ఎస్‌ఐ గుర్తించడంతో వారిని పట్టుకుంటున్న ప్పుడు ఎస్‌ఐ విధులకు ఆటంకం కలిగిస్తూ ఆమెపై దౌర్జన్యం చేశా రు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ పోలీసులు సంఘనాస్థలానికి చేరుకున్నారు. దౌర్జన్యం చేసిన వారు పరారీలో ఉండడంతో లక్ష్మి బంధువులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-04-15T09:55:27+05:30 IST