ఈ నెల 21న చేబ్రోలులో ‘మెగా జాబ్‌ మేళా’

ABN , First Publish Date - 2020-12-19T05:54:33+05:30 IST

వికాస, ఆదర్శ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21న చేబ్రోలులో మెగాజాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు.

ఈ నెల 21న చేబ్రోలులో ‘మెగా జాబ్‌ మేళా’

వికాస పీడీ లచ్చారావు 

కాకినాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : వికాస, ఆదర్శ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21న చేబ్రోలులో మెగాజాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. మేళాలో 1300 మందికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఎల్‌జీడీ సొల్యూషన్స్‌, ఫాబిన్‌ టెక్నాలజీస్‌, డ్రీ మ్‌వే, హెటిరో డ్రగ్స్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌, ఆర్‌ఎస్‌ఎంఐపీఎల్‌ సంస్థల ప్రతినిధులు వస్తున్నారన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ (ఫిట్టర్‌, వెల్డర్‌) డిగ్రీ, డిప్లమో, బీటెక్‌, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. అయితే 18 నుంచి 30 లోపు వయస్సు ఉండాలన్నారు. ఉద్యోగాలన్నీ ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ విద్యార్హతలతో పాటు, జెరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు 0884-2352767, 2352765 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

Read more