-
-
Home » Andhra Pradesh » East Godavari » Vijayabhaskar Additional Director
-
‘నాడు-నేడు’ పనులు వేగవంతం
ABN , First Publish Date - 2020-05-13T09:49:57+05:30 IST
ఎంపిక చేసిన పాఠశాలల్లో నాడు-నేడు పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా సమగ్ర శిక్షా

జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ విజయభాస్కర్
రాజమహేంద్రవరం సిటీ, మే 12: ఎంపిక చేసిన పాఠశాలల్లో నాడు-నేడు పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ విజయభాస్కర్ సూచి ంచారు. మంగళవారం మండలవనరుల కేంద్రంలో ఆయన, డీఐ దిలీ్‌పకుమార్‌తో కలిసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు-నేడు పనులకు సంబంధించి ఖర్చుపెట్టిన ప్రతీపైసా వివరాలు ఎస్‌టీఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని ఆయన స్పష్టం చేశారు.